ELR: ఫీజులు కట్టని టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్స్ ఇవ్వని విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఎ) ఏలూరు జిల్లా కార్యదర్శి జి. అఖిల్ డిమాండ్ చేశారు. ఆగిరిపల్లిలో ఆయన మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ.. పంటలు సక్రమంగా పండని రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారని అన్నారు.