కోనసీమ: మండపేట మండలం ద్వారపూడిలో రాత్రి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తీర్థ కావడి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సుమారు 600 మంది మహిళలు తీర్థ బిందెలు ధరించగా, 200 మంది స్వాములు కావడి ఉత్సవంలో పాల్గొన్నారు. రథంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.