అన్నమయ్య: నిమ్మనపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ)లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మునివెంకటమ్మ తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఏప్రిల్ 13న ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.