SKLM: కవిటి మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేటికీ భారతదేశంలో కొనసాగుతుందని కరస్పాండెంట్ లాల రాజేష్ తెలిపారు. అంబేద్కర్ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.