CTR: శాంతిపురం(M) గొల్లపల్లిలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ‘గొల్లపల్లి ప్రీమియర్ లీగ్’ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో అమిగోస్- 11 టీంపై భగత్ సింగ్- 11 టీం ఘన విజయం సాధించింది. అనంతరం విజేతలకు గ్రామస్థులు బహుమతులు ప్రదానం చేశారు. క్రీడల ద్వారా ఐక్యతను చాటడమే ఈ టోర్నీ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.