ప్రకాశం: దళితులకు స్మశాన భూములు కేటాయించాలని దళిత నేత నీలం నాగేంద్ర మార్కాపురం జేసీ శ్రీనివాసులను కోరారు. మంగళవారం జేసీను కలిసి దళితుల ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఆమోదించిన కోనేరు రంగారావు కమిటీ జీవోలను అమలు చేయాలని, దళిత భూములను ఇతరులు ఆక్రమించి అమ్ముకుంటున్నారన్నారు.