CTR: పూతలపట్టు మండలం కిచ్చన్నగారిపల్లి సమీపంలో బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తిరుపతి వైపు నుంచి చిత్తూరు వైపు లారీ బయల్దేరింది. ముందు వెళ్తున్న వాహనం బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ డ్రైవర్ తలకు గాయం కావడంతో అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సింది.