ఎన్టీఆర్: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటమట ఎస్సై రేవతి ఆదివారం అర్ధరాత్రి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. మహానాడు జంక్షన్ వద్ద ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనాలను ఆపి పత్రాలు పరిశీలించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపేవారు, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రైవేట్ బస్సులను కూడా తనిఖీ చేశారు.