SS: అద్దె కార్లను తాకట్టు పెట్టి యజమానులను వంచించిన ఘటన పెనుగొండ మండలంలో వెలుగుచూసింది. వెంకటరెడ్డిపల్లికి చెందిన హరి, అతడి అనుచరులు నెలకు రూ.45 వేల అద్దెకు 25 కార్లు తీసుకున్నారు. 2 నెలల తర్వాత అద్దె ఇవ్వకుండా, ఒక్కో కారును రూ.2 లక్షలకు తాకట్టు పెట్టారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.