CTR: వీ.కోట మండలంలో “మీ ఊరికి- మీ ఎమ్మెల్యే” కార్యక్రమం నాలుగో రోజు కొనసాగింది. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి చింతమాకులపల్లి, బోయ చిన్నాగానపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లు, ఇరిగేషన్, ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామన్నారు.