కృష్ణా: కోడూరు మండలం మందపాకలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సోమవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. ఇన్ పేషేంటు వార్డులో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించారు. ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు, ప్రసూతి సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారిణి డాక్టర్ కే.శిరీష తెలిపారు.