ASR: నందిగరువు మాట–మంతి కార్యక్రమంలో భాగంగా పాడేరు పర్యటనకు వచ్చిన డిప్యూటీ పవన్ కళ్యాణ్‌కు గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మసాడా ఈశ్వరరావు మాట్లాడుతూ.. జీవో నం.03 స్థానంలో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని అమలు చేసి 100 శాతం ఆదివాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.