NTR: టీడీపీ పార్టీ మరింత బలోపేతమే ప్రధాన లక్ష్యంగా గ్రామాల్లో నాయకులు ఐకమత్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు. జి. కొండూరు మండలం వెలగలేరుకి చెందిన టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, పంటలు, రైతులకు గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై చర్చించారు.