అనంతపురం జిల్లా వెనుకబాటు తనాన్ని పారద్రోలిన RDT సంస్థను కాపాడుకునేందుకు మాజీ ఎంపీ తలారి రంగయ్య పోరాటం చేపట్టారు. కంబదూరు మండలం ఎర్రబండ గ్రామంలో పొలాల్లో రైతులు, కూలీలను కలిసి FCRA రెన్యూవల్ ఆవశ్యకతను వివరించారు. పేదలకు అండగా నిలిచిన సంస్థకు జరుగుతున్న అన్యాయంపై ప్రధానమంత్రికి లక్ష పోస్టుకార్డులు పంపే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.