KRNL: ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని భక్తి శ్రద్ధలతో దర్శించిన ఆమె, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, రైతుల సంక్షేమం, యువతకు మంచి భవిష్యత్తుతో పాటు ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు.