SRCL: ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని వరి పంటలు, గడ్డి వాములు, బోరు మోటార్లు, విద్యుత్ వైర్లు కాలిపోయాయి. కైరి పర్శరాములతో పాటు పలువురు రైతులు నష్టపోయారు. ఆరు నెలల కష్టం క్షణాల్లో బూడిద కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్నారు.