కడప జిల్లాలో గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఎర్రగుంట్ల సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా భారత ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని, గ్యాస్ కొరతతో చిన్న వ్యాపారులు, హోటళ్లు మూసుకునే దుస్థితి ఏర్పడిందని అన్నారు.