GNTR: పాతగుంటూరు పరిధిలో హత్య, పోక్సో మొత్తం 6 కేసుల్లో నిందితుడిగా ఉన్న శివనాగరాజుకాలనీకి చెందిన వేముల గోవిందు(24)పై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. పలుమార్లు జైలుకు వెళ్లినా నేరాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడని తెలిపారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ ఉత్తర్వులతో అతడిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.