BDK: భద్రాచలంకు చెందిన ఎం. మోజెస్ (21) అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మోతుగూడెం మండలం పొల్లూరు జలపాతం వద్ద మృతి చెందాడు. మోజెస్ నీటిలో మునుగుతుండగా స్నేహితులు గమనించేలోపే ప్రాణాలు కోల్పోయాడని ఎస్సై అబ్దుల్ నస్సిర్ హుసైన్ తెలిపారు. రాజమహేంద్రవరం గైడ్ కళాశాలకు చెందిన ఐదుగురు స్నేహితులు కలిసి ఇక్కడికి విహారయాత్రకు వెళ్లారు.