విశాఖ: గ్లామ్ ఇండియా అందాల పోటీలో విశాఖకు చెందిన ఇంద్రాణి చక్రవర్తి విజేతగా నిలిచారు. ఇటీవల భువనేశ్వర్ వేదిక నిర్వహించిన మిసెస్ గ్లామ్ ఇండియా-2026 టైటిల్ సాధించారు. పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రధాన టైటిల్‌తో పాటు డైమండ్ రింగ్, ఉత్తమ స్టైలిస్ట్, ఉత్తమ జాతీయ దుస్తులు, ఉత్తమ ఇంటర్వ్యూ టైటిల్స్ పొందారు.