KDP: అట్లూరు (M)లోని ముత్తుకూరుకు చెందిన బోవిళ్ల పెంచల్ రెడ్డి ఉపాధి హామీ పనికి వెళ్లాడు. పని ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామంలో రోడ్డు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొని కాలు ఫ్రాక్చర్ అయింది. వెంటనే గ్రామస్థులు మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.