మన్యం: గుమ్మలక్ష్మీపురం మండల పరిధిలోని భద్రగిరి గిరిజన సంక్షేమ నివాస విద్యాసంస్థల్లో జరుగుతున్న పలు అభివృద్ధి, నిర్మాణ పనులను ఐటీడీఎ పి.ఓఆర్.వైశాలి గురువారం విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్శనలో భాగంగా భద్రగిరిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె నిశితంగా పరిశీలించారు. మరుగుదొడ్ల సముదాయాన్ని పరిశీలించారు.