E.G: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు జరిగాయని డీఆర్ఎ సీతారామ మూర్తి తెలిపారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లాలో మే 25 -జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలోని 32 పరీక్షా కేంద్రాల్లో 2,748 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారన్నారు.