KKD: జిల్లా కలెక్టరేట్లోని వికాస కార్యాలయం వద్ద ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు 2024, 25, 26 సంవత్సరాల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు, అలాగే సీయోన్ కంపెనీ ఉద్యోగాలకు బీటెక్, డిప్లొమా చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాల కోసం 84616 93922 నంబర్లో సంప్రదించవచ్చన్నారు.