KNR: వీణవంక మండల కేంద్రంలో గురువారం 108 వాహనాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ భూమా నాగేందర్, కరీంనగర్ జిల్లా ఇంఛార్జ్ సయ్యద్ ఇమ్రాన్, GVK EMRI హైదరాబాద్ హెడ్ ఆఫీస్ క్వాలిటీ ఆడిటర్ ఏ. కిశోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లలో మందుల లభ్యత, పరికరాల పనితీరు, సేవల రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.