AP: రాష్ట్రంలో ఎండలు నిప్పుల కుంపటిలా మారాయి. ఇవాళ 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 219 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుంది. అల్లూరి, పోలవరం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 45-47 డిగ్రీల వరకు.. కాకినాడ, నెల్లూరుల్లో 43-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనంతో నెల్లూరు, పోలవరం జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురవవచ్చు.