PLD: పిన్నెల్లిలో వరిగడ్డివాము దగ్ధం కాగా సుమారు రూ. 70 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు మాడుగుల మోషే తెలిపారు. 3 ఎకరాల్లో వరిగడ్డిని కొనుగోలు చేసి గడ్డివాము వేసుకున్నానని గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని పిల్లలు ఆడుకుంటూ అగ్గిపుల్ల గీయటంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. PDRL ఫైర్ సిబ్బంది, స్థానిక సచివాలయ సిబ్బంది శాయశక్తుల కృషిచేసి మంటలను అదుపులోకి తెచ్చారు.