NDL: నకిలీ ఏపీకే ఫైళ్ల రూపంలో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాణ్ ఓ ప్రకటనలో సూచించారు. వాట్సాప్, SMS, టెలిగ్రామ్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులు, ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని హెచ్చరించారు. వైరస్లు, మాల్వేర్ల ద్వారా డేటా చోరీ చేసి సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారన్నారు.