నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘రామాయణ’. అయితే ఈ సినిమా హిందీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ధర ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత నమిత్ మల్హోత్రా హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ఏకంగా రూ.450 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ ధరను కాస్త తగ్గించాలని కోరుతున్నట్లు సమాచారం.