HYD: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోల్-ఉప్పల్-హబ్సిగూడ, బోడుప్పల్- ఉప్పల్-అంబర్పేట్ మార్గాల్లో భారీ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.