కోనసీమ: అమలాపురం రూరల్ మండలం కామనగరువులో గురువారం సాయంత్రం ఒక కారు అదుపుతప్పి విద్యుత్ జనరేటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రాంతంలో వాహనాల వేగాన్ని అరికట్టేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.