WG: ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి నేతలు అడ్డుకోవడం శోచనీయమని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. మహిళల సాధికారత, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం వారికి అన్యాయం చేసే విధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.