బాపట్ల పట్టణంలో దోమలను సమూలంగా నిర్మూలించి, మలేరియా, డెంగీ, చికెన్ గునియా వంటి కీటక జనిత వ్యాధులను అరికట్టడం ప్రధాన లక్ష్యమని జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జున రావు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం వివేకానంద కాలనీలో నిర్వహించిన డ్రై డే కార్యక్రమాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.