కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు ఎస్సై మంజునాథ కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.