కడప: ఖాజీపేటలోని పలు హోటళ్లపై V&E, సివిల్ సప్లై అధికారులు ఆదివారం అకస్మిక దాడులు చేపట్టారు. గృహ వినియోగానికి కేటాయించిన LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని 6 కేసులు నమోదు చేసి, 16 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయన్నారు.