NLR: జిల్లాలో ధాన్యం ధరలు పడిపోవడం, కొనుగోలు కేంద్రాల్లో అవస్థల కారణంగా రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని సోమవారం నెల్లూరుకు విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు బీజేపీ నేతలు వివరించారు. తేమ పేరుతో మిల్లర్లు పుట్టికి అదనంగా 120 కిలోల వరకు ధాన్యం తీసుకుంటున్నారని, తేమ సమస్యకు పాడీ డ్రయ్యర్లను సబ్సిడీపై అందుబాటులోకి తేవాలని మంత్రిని కోరారు.