మార్కాపురం పట్టణంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండో రోజు అయిన గురువారం ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రధాన మాడవీధులలో స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు తరలి వచ్చారు.