ప్రకాశం: కంభంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెన్సస్ 2027 కార్యక్రమానికి సంబంధించి శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. ఈ శిక్షణలో భాగంగా జనగణన ప్రక్రియ, డేటా సేకరణ విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై అధికారులు వివరణ ఇచ్చారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందికి గృహ గణన, సమగ్ర సమాచార సేకరణలో పాటించాల్సిన విధానాలను వివరించారు.