PLD: నరసరావుపేట రావిపాడు రోడ్డులోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ సమీపంలో సుమారు రూ.5 కోట్ల అంచనాతో నిర్మించనున్న 33/11 కే.వీ విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఉపకేంద్రం ద్వారా ప్రాంతంలో విద్యుత్ సరఫరా స్థిరపడనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.