WGL: అక్రమంగా నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని దుగ్గొండి పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని రేపెల్లి ఎక్స్‌రోడ్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని తనిఖీ చేయగా, అతని వద్ద నుంచి 10 లీటర్ల నాటు సారా ప్యాకెట్లు లభించాయి. వీటిని విక్రయానికి తీసుకెళ్తున్నట్లు నిందితుడు తెలపడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.