విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్ సమీప రైల్వే బ్రిడ్జ్ వద్ద భారీ లారీ బ్రిడ్జ్‌ను ఢీకొని ఇరుక్కుపోయింది. అధిక ఎత్తుతో లోడ్ తీసుకెళ్తూ డ్రైవర్ ఎత్తు పరిమితి గమనించకపోవడంతో లారీ పైభాగం గర్డర్‌ను తాకింది. దీంతో రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలు కట్టాయి. పోలీసులు చొరవ తీసుకుని ట్రాఫిక్‌ను మళ్లించారు.