అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజలకు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని లింకులు క్లిక్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయడం లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు. మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.