GNTR: మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలోని గుంటూరులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, నగరంలోని ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.