ATP: ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఖండించారు. జగన్ నిర్ణయాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమని విమర్శించారు. రౌడీయిజం వల్లే గత ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. రాజధాని అంశంపై రాధాకృష్ణ విశ్లేషణను జీర్ణించుకోలేక దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.