NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన చిన బాబును వైస్ చైర్మన్ పటాన్ నస్రిన్, టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. పట్టణంలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఖాజా నగర్లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.