తిరుపతి జిల్లా సహకార అధికారి (DCO)గా సురేష్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సహకార శాఖ ద్వారా జరుగుతున్న వివిధ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, తదితర అభివృద్ధి పథకాలపై కలెక్టర్‌తో ఆయన ప్రత్యేకంగా చర్చించారు.