అన్నమయ్య: మంగళగిరిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్రస్థాయి ఎస్ఐఆర్ వర్క్‌షాప్ మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్, నాగూర్ హాజరయ్యారు. ఓటర్ల జాబితా పునఃపరిశీలన, పార్టీ బలోపేతంపై సీఎం దిశానిర్దేశం చేశారు. పార్టీ క్రమశిక్షణతో పనిచేసి ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేస్తామని నేతలు తెలిపారు.