PPM: భామిని మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొతూరు గ్రామానికి చెందిన శంకర్ బాలేరు PHCలో నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం శనివారం సాయంత్రం ఆసుపత్రికి బైక్పై బయలుదేరాడు. ఆ దారిలో ఎద్దుల బండిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు అంబులెన్సులో ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.