ATP: గుత్తిలోని బైబిల్ మిషన్ చర్చి (స్వస్థతశాల) క్రైస్తవ భక్తులతో కిక్కిరిసిపోయింది. బైబిల్ మిషన్ చర్చిలో పాస్టర్ రెవరెండ్ అద్భుత కుమార్, మణి కుమారి ఆధ్వర్యంలో ఆదివారం ఈస్టర్ వేడుకలను అత్యంత ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాయలసీమలోని ఆయా ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. దీంతో చర్చి జనసంద్రంగా మారింది.