అన్నమయ్య: రాజంపేట బార్ అసోసియేషన్ 2026-27 ఎన్నికల్లో అధ్యక్షుడిగా సింగంశెట్టి కృష్ణ కుమార్, ఉపాధ్యక్షుడిగా కత్తి సుబ్బారాయుడు సోమవారం విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం న్యాయవాదులు, సహచరులు విజేతలను అభినందించారు. వారి నాయకత్వంలో బార్ అసోసియేషన్ మరింత అభివృద్ధి చెందాలని, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.